గుడికి వెళ్తే అందరితో కలిసి వెళ్ళమని చెప్పేది మన సంప్రదాయం...ఎందుకు?
ఏదయిన బాధ నలుగురితొ పంచుకుంటే తరుగుతుంది, అదే సంతోషం ఆ నలుగురితో పంచుకుంటే పెరుగుతుంది అని...
భగవంతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనలో ఎన్నో విషయ వాంఛలు విషయ బాధలు సహజంగానే మూట కట్టుకుని వెళ్తాం... యే మూలో కొద్దిగ సంతొషం ఉన్నప్పటికినీ అప్పుడు ఉన్న బాధలు కోరికలు దాన్ని మింగేస్తాయి...ఆందుకోసం గుడికి వెళ్ళినప్పుడు నలుగురితొ కలిసి వెళ్ళాలి...
నలుగురిలో మనం అనే భావన వల్ల ఆ బాధలనేవి ఏమున్నాయో అవి తరుగుతాయి...వాంఛలనేవి ఏమున్నాయో అవి ఎంత వరకు మనకు అవసరమో...ఎంత వరకు మనము అర్హులమో అనె ఆత్మ పరిశీలన కలుగుతుంది.... ఏ మూలో మూసేసిన సంతొషం ఇంతింతై అన్నట్టు దేవుడి కరుణ కటాక్ష వీక్షనాలతో రెట్టింపవుతుంది...ఆ భగవంతుడి దర్శన భాగ్యంతో మనసు పారవశ్యం చెంది ఎంతొ ధైర్యాన్ని మనశ్శాంతిని మన మనసు నింపుకుంటుంది...
గుడికి వెళ్ళినప్పుడు ఆ స్వామి అనుగ్రహదాహంతో అర్రులు చాచేలా మన మనస్సు అనే పాత్రతో ఖాలీగా వెళ్ళలి గాని... అర్థం లేని కొరికలతో...ద్వేషంతో...అసూయతొ నింపుకుని...మన కోరికల కంటె పక్క వాళ్ళకు ఎదో ఉందని, అంతకంటే ఎక్కువ నాకు కావాలనే ఆశతో మనం భగవంతుడి ముందు చేయి చాపుతున్నాం.
స్వామి ముందు కళ్ళు మూసిన ఒక్క క్షణం "మన" అన్న అహం మరచిపోయి ఒక్క క్షణం భగవంతుడి మీద మన దృష్టి నిలిపి ఒక్కసారి ఆలోచించండి... ఈ అనంత విశ్వం ఆ స్వామి సృష్టి, అందులో మనం ఒక రేణువు లాంటి వాళ్ళం మాత్రమే ...ఇంత సృష్టిని కాపాడే ఆయన మనల్ని కూడా కాపాడతాడు అనే విశ్వాసం నింపుకున్న కళ్ళతో మనకు ఆ స్వామి ప్రేమ తప్ప అన్యమయినది ఏది సహించలేని ఆర్తితో ఆయన ముందు మోకరిల్లుదాం.
- Lakhsmi Sravanthi Chowdam