Thursday, September 24, 2009

My Lost Mornings

ఈ రోజు వేకువనే నేను చూసిన మొదటి దృశ్యం, రూం లో పవర్ లేదు. బయటకి వచ్చి చూస్తే అప్పుడే తెలవారుతుంది. ఈ మహా నగరం లో సూర్యోదయం చూడ లేకపోయినా, పక్షుల కిల కిలలు లేకపోయినా అప్పుడే పుట్టినట్లుండే ప్రకృతి కూడా నచ్చింది. ఈ కాలుష్యపు ప్రపంచంలో ఇంకా మనును కదిలించే దృశ్యాలు కనిపిస్తున్నాయంటే అది దేవుడున్నాడని రుజువేమో!!!

అప్పుడు నాకు మా ఇల్లు గుర్తొచ్చింది. మా ఇంట్లో వాకిట్లో జాజి చెట్టు ఉంది. పొద్దున్నే సూర్యుడు రాకముందు చూస్తే ఎలా ఉంటుందంటే బాగా విచ్చిపోయిన జాజుల మీద మంచు బిందువులు , పూల లోని తేనె కోసం వాటి చుట్టూ తిరిగే సీతాకోకచిలుకలు. ఆహ్లాదమయిన చిరుగాలి, వెచ్చటి సూర్య కిరణాలతో ప్రశాంతంగా ఉండేది. అప్పటికే అమ్మ అన్ని పనులు ముగించేసి, వేడి టీ రెడీ చేసి పెట్టేది. బద్దకంగా ఆ టీ తాగుతూ పేపర్ చదివేదాన్ని.

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీరు తెలుగులో....:) కొనసాగించండి ఇలాగే...

లక్ష్మి స్రవంతి, said...

Vijaya Mohan garu,

Thanks for your comments first.

Will try to write in Telugu, for sure from next time.

ప్రశాంత్ said...

బాగుందండి మీ బ్లాగ్. మా ఇంట్లొ అందరిళ్ళళ్ళో కన్నా పెద్ద జాజి చెట్టు ఉంది. ఇంకా ఉంది లెండి, ఇంకొ పది రొజుల్లొ చూస్తా దాన్ని.

Made me feel nostalgic. Thank You for reminding me of my home :P

Unknown said...

Hi Sravanthi, This is prem. I am very much impressed with your words expressed here. keep rocking.